అంశము : తెలుగు తెలుగు వికీపీడియాలో వ్యాసం అన్వేషణ, చదవటం ఎలా ?
పాఠ్య లక్ష్యం: తెలుగు వికీపీడియా లో ఒక వ్యాసమును ఎలా అన్వేషించాలి, చదివేటప్పుడు అందులోని హైపర్ లింక్స్, ఒక వ్యాసములోనుండి మరి యొక్క వ్యాసానికి వున్న హైపర్ లింక్స్, వాటి అవసరం, తరువాత చదువు కొనుటకు వ్యాసమును ఎలా PDFగా డౌన్లోడ్ చేసుకోవటం.
ఈ పాఠములో -
తెలుగు వికీపీడియా వ్యాసo PDF డౌన్లోడ్ - వీడియో 11.06 నిమిషాలు
అభ్యాస ఫలితం : పాఠము ముగిసే సరికి, తెలుగు వికీపీడియాలో వ్యాసము అన్వేషణ, చదువుట, డౌన్లోడ్ గురించి నేర్చుకొంటారు.
వికీపీడియా:అన్వేషణ
వికీపేడియాలో అన్వేషణ, శోధన, అయోమయ నివృత్తి పేజీ వివరాలు
స్క్రీన్ పై కుడివైపున ఉండే సెర్చ్ బాక్స్ ఉపయోగించి ఆర్టికల్స్ అన్వేషించవచ్చు. ఇక్కడ నేను అన్వేషణ అనే వ్యాసం కోసం వెతికాను.
కొన్ని సార్లు మీరు టైపు చేసే పదానికి ఎక్కువ అర్థాలు వుంటే అప్పుడు అయోమయ నివృత్తి పేజీకు వెళ్తుంది. ఈ పేజీ లో ఒకే పేరు మీద సృష్టించబడిన వివిధ పేజీలు కనిపిస్తాయి. మీరు సులభంగా మీకు కావలసిన పేజీ ఎంచుకొని చదువుకోండి. ఉదా: చలం పేరు మీద వున్న వ్యాసాలు.
పేజీలో పేజీ లింకులు, ఇతర పేజీల నుండి ఈ వ్యాసంకి లింక్, వ్యసవ్యాసమునకు సంభందిత మార్పులు
పరిశోధన - వ్యాసాలలొ హైపర్ లింక్స్
పరిశోధన - వ్యాసం PDF డౌన్ లోడ్ చేసుకోవటం ఎలా ?
మీరు చదువుతున్న వ్యాసం అందులో హైపర్ లింక్ చెయ్యబడిన సంబందిత వ్యాసాలు మీ పరిశోధనకి ఉపయోగo అనుకొంటే, ప్రతిసారి ఆన్ లైన్లో చూడవలసిన అవసరం లేకుండా ఆ వ్యాసాలను PDF రూపంలో డౌన్ లోడ్ చేసుకొని భద్రపరుచుకోండి. ఈ డౌన్ లోడ్ ఉచితం.